క్రీడల్లో ప్రతిభ కనబరిచిన నీల్వాయి విద్యార్థినిలు

వేమనపల్లి,అక్టోబర్ 22, (జనంసాక్షి):

మంచిర్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను దౌడపెళ్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు డాక్టర్ దాసరి మల్లేష్ తెలిపారు.ఈ పోటీలలో వేమనపల్లి మండలంలోని నీల్వాయి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నుండి వివిధ క్రీడాఅంశాల్లో క్రీడాకారులు జడగల్ల అంజలి,ఎండి హర్షిని భాను,చెండె కృష్ణవేణి,నెండుగూరి శ్రావణి,టకిరె కృష్ణవేణి,భీమరాజుల బతకక్క పాల్గొని ఘన విజయం సాధించారని అన్నారు.6 బంగారు పతకాలు,5 వెండి పథకాలు,5 కాంస్య పథకాలను కైవసం చేసుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు.మంచిర్యాల జిల్లాలో 16 పథకాల ఘనత సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారని తెలిపారు.అత్యధిక ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 23వ తేదీలో తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు వరంగల్ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబడే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ దాసరి మల్లేష్ తెలియజేశారు.విజేతలను జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ డివైయస్ఓ,అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,వ్యాయామ ఉపాధ్యాయులు,మండల అధికారులు,ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు అభినందించారు.