క్రీడల్లో లక్ష్య సాధనకు కనబరచే పట్టుదలనే విద్యాభ్యాసం లో అనుసరించి విజయాలు సాధించాలని

•జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.
నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 13 జనం సాక్షి: గురువారం కల్వకుర్తి జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ క్రీడలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి 13 పాఠశాలలు, 9 కళాశాలలు పాల్గొంటున్నాయి.  కబడ్డీ, వాలీబాల్, ఖోఖో తో పాటు అథ్లెటిక్స్ క్రీడలో పాల్గొనడానికి 270 మంది క్రీడాకారులు అండర్ 14, అండర్ 19 వారిగా పోటీలో పాల్గొననున్నారు.  కలెక్టర్ శాసన సభ్యులు క్రీడాకారులను పరిచయం చేసుకుని మొదటగా వాలీబాల్ క్రీడను బాల్ పుష్ చేశారు.   ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాధించడానికి ఒక ప్రణాళిక తో సన్నద్ధం అవుతారన్నారు.  లక్ష్యసాధనలో ఒక్కోసారి విజయం సాధించవచ్చు లేదా సాధించక పోవచ్చు కానీ పట్టుదల వదలకుండా ఒక క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తారని తెలిపారు. ప్రభుత్వం గురుకుల సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేసి అనేక మౌఖిక సదుపాయాలు కల్పిస్తూన్నారని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  జీవితంలో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించుకునేందుకు క్రీడల్లో ప్రదర్శించే నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని తెలియజేసారు.
      ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ కల్వకుర్తి ఒక ఎడ్యుకేషన్ హబ్ గా అవతరించిందని అన్ని రకాల విద్యాలయాలు కల్వకుర్తిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బి.సి. గురుకుల ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లాలోని 13 బిసి గురుకుల పాఠశాలలు, 9 బి.సి గురుకుల కళాశాలలకు క్రీడలు నిర్వహించే స్థాయిలో కల్వకుర్తి బి.సి. గురుకుల పాఠశాలలో సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాలుర  బి.సి. గురుకుల పాఠశాల సైతం కల్వకుర్తి కె మంజూరు అయ్యిందని స్టేడియం గ్రౌండ్ బిల్డింగ్ లో దీనిని ప్రారంభించబోతున్నట్లు తెలుయజేశారు.  విద్యకు అత్యంత ప్రధాన్యత ఇచ్చి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. రేపు ప్రారంభం చేయబోయే బి.సి బాలుర గురుకుల పాటశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి సందర్శించారు.  బాలుర గురుకుల పాఠశాలకు అవసరమైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు పై కలెక్టర్ తో చర్చించారు.
       ఈ కార్యక్రమంలో జిల్లా బి.సి. సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్,   మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, ఎంపీపీ మనోహర, వైస్ ఎంపీపీ గోవర్ధన్, ప్రిన్సిపాల్ సరిత, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఆర్.సి.ఓ లింగయ్య,  తహసిల్దార్ రాంరెడ్డి, వెల్దండ సర్పంచ్ భూపతి రెడ్డి, పి ఈ.టీ లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.