క్రీడా ప్రాంగణ పనులను పూర్తి చేయాలి
ఎంపీడీవో రాఘవ
ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 17 గ్రామాలలో చేపట్టిన క్రీడ ప్రాంగణ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎంపీడీవో రాఘవ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పుటాన్ దొడ్డి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగణ మైదానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని స్థానిక సర్పంచ్ స్వాతి, గ్రామ ప్రజల సహకారంతో స్థలాన్ని పరిశీలించి స్వత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుణ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.