క్రీడా మైదానాలు.. పశువులకు సేద ప్రాంతాలు..
డోర్నకల్ అక్టోబర్ 12 జనం సాక్షి
పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలోని నైపుణ్యాలను వెలికితీసి క్రీడల్లో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆట మైదానాలు ఏర్పాటు చేస్తోంది.ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అట్టాసంగా వాటిని ప్రారంభించింది.తర్వాత నిర్వాణలోపంతో అవి నిరుయోగంగా మారాయి. ఆటల పేరిట దాదాపు 6 లక్షల రూపాయలు వెచ్చించారే తప్ప అటు వైపు చూసే వారు లేరని పరిస్తీతులు చెబుతున్నాయి.
క్రీడా ప్రాంగణాలకు ఎకరం నుంచి 1.5 ఎకరాల స్థలం కేటాయించాల్సి ఉండగా స్థలం కొరత ఉన్నప్పటికీ తాహాసిల్దార్లు సహకారంతో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలకు స్థలాలను కేటాయించింది.
డోర్నకల్ మండలంలో బొడ్రాయితండా, గొల్లచర్ల,అమ్మపాలెం,డోర్నకల్ పట్టణం లాంటి చోట్ల ఉపాధి నిధులతో క్రీడా ప్రాంగణాలను అధికారులు ప్రారంభించారు.కొన్నిచోట్ల ఈ ప్రాంగణాల్లో కబడ్డీ, ఖోఖో,వాలీబాల్,లాంగ్, బ్యాట్మెంటన్ వివిధ రకాల వ్యాయమాలు చేసేందుకు సింగిల్,డబల్ బార్లను ఏర్పాటు చేయగా మరికొన్ని చోట్ల క్రీడ ప్రాంగణాల సూచిక బోర్డులను ఏర్పాటు చేసి అలాగే వదిలేశారు.మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా సుమారు ఎకరం స్థలంలో 4 లక్షల వ్యయంతో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.అందులో సూచిక బోర్డు,శంకుస్థాపన దిమ్మె తప్ప క్రీడా పరికరాలు,సౌకర్యాలు కనిపించడం లేదని క్రీడాకారులు,యువత వాపోతున్నారు.
నాలుగు నెలలు అవుతున్నా…
క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్న కొన్నిచోట్ల సౌకర్యాలు లేమితో యువత క్రీడాకారులు అటువైపు తొంగి చూడటం లేదు.దీంతో లక్షల రూపాయల ఖర్చు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది.క్రీడలు ఆడుదామన్న వాటిని ఆడిపించే వారు లేరు.ఆట వస్తువులు అందించే వారు అసలు లేరు.సర్పంచ్ లు,వార్డు మెంబర్లతో ఆడుదామంటే బిల్లులు రాలేదనే బాధలు వారు ఉన్నారు.సర్పంచులకు కనీసం బెల్ట్ షాపు వద్ద అప్పు పుటని పరిస్తితీ. ఇలా ఆట స్థలాల్లో క్రీడాకారులు కనబడక అవులు,గేదెలు కనిపిస్తున్నాయి.ఆట స్థలాలు కాస్త పశువుల మేత స్థలాలుగా మారాయి.ఎంపిక చేసిన స్థలం చుట్టూ ఫెన్సింగ్ మాదిరిగా కానుగు, గుల్మోహర్,నిమ్మ,చింత,బాదాం,వెదురు,తంగేడు చెట్లు పెంచాల్సి ఉన్నప్పటికీ మొక్కలు నాటి ఆలన మరిచారు.క్రీడా ప్రాంగణం చుట్టూ రక్షణగా ఏమి లేకపోవడంతో పశువుల ప్రాంగణంగా మారుతున్నాయి.క్రీడా స్థలాన్ని చదును చేయకుండానే ఎగుడుదిగుడు భూమిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు.ఆట స్థలం కాస్త పిచ్చి మొక్కలు,మలవిసర్జన,పశువుల సేద ప్రాంతాలుగా మారాయి.దీనివల్ల అక్కడ ఆటలు ఆడలేని పరిస్థితి నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు,నూతన పార్టీ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంగణాల్లో అన్ని రకాల సౌకర్యాలు వివిధ రకాల క్రీడా పరికరాలు ఏర్పాటు చేయాలని స్వరాష్ర్ట ప్రజలు కోరుతున్నారు.