క్లార్క్ రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం

2015 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. సొంత గడ్డపై జరగనున్న ఈ వరల్డ్కప్ ముగిశాక వన్డే సారథ్య బాధ్యతలు యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్‌కు అప్పజెప్పాలన్నాడు. వన్డే పగ్గాలు స్మిత్‌కు అప్పగించేందుకు ఇదే మంచి తరుణమన్నాడు. వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చి క్లార్క్ టెస్టులపై దృష్టి పెడితే బాగుంటుందన్నాడు. గాయాలతో బాధపడుతున్న క్లార్క్ సాంప్రదాయ ఫార్మాట్‌లో ఆసీస్‌ను లీడ్ చేయాలని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు