క్వార్టర్‌ ఫైనల్లో సైనా


సింగపూర్‌ ,జూన్‌ 20 (జనంసాక్షి) :

సింగపూర్‌ ఓపెన్‌లో భారత షట్లర్‌ సైనానెహ్వాల్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. రెండో సీడ్‌గా ఆడుతోన్న సైనా ప్రీక్వార్టర్స్‌లో 16-21 , 21-16 , 21-9 తేడాతో జపాన్‌కు చెందిన ఎరికో హిరోస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నుండి హైదరాబాదీకి గట్టిపోటీ ఎదురైంది. తొలి సెట్‌ను కోల్పోయి వెనుకబడిన సైనా… తర్వాత పోరాడి వరుస సెట్లలో పుంజుకుంది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ , మిక్సిడ్‌ డబుల్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రెండో సీడ్‌కు షాకిచ్చిన తెలుగుతేజం సాయిప్రణీత్‌ రెండో రౌండ్‌లో పరాజయం పాలయ్యాడు. మలేషియాకు చెందిన ఫెంగ్‌ చాంగ్‌ 2111, 1721 , 2116    తేడాతో ప్రణీత్‌పై గెలుపొందాడు. అలాగే మిక్సిడ్‌ డబుల్స్‌లో అపర్ణా బాలన్‌-అరుణ్‌ విష్ణు జోడీ కూడా ఇంటిదారి పట్టింది. ఇండోనేషియాకు చెందిన జోర్డాన్‌-మరిస్సా చేతిలో 21-10 , 21-18 తేడాతో భారత జోడీ పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్‌-అక్షయ్‌ జోడీ కూడా ఓడిపోయింది.