క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుంటాం
నల్గొండ బ్యూరో. జనం సాక్షి దేశ సంపదను సార్వభౌమత్వాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తిప్పి కొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి తో ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు
మంగళ వారం నల్లగొండ లో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నాడు బ్రిటిష్ వారిని దేశం వదిలి వెళ్లిపోవాలని క్విట్ ఇండియా పిలుపు నిచ్చారని నేడు సామ్రాజ్యవాద బహుళ జాతి కార్పోరేట్ సంస్థల నుండి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. బిజెపి ప్రభుత్వ మోడీ పాలనలో ప్రభుత్వరంగ సంస్థల మొత్తం ప్రైవేటు పరం చేస్తూ దేశ సంపదను కార్పో రేట్ శక్తులకు దోచిపెడుతున్నాయని ఆరోపించారు.దేశంలో హరించ బడుచున్న రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని అన్నారు. మోడీ పాలనలో తినే తిండి పైన, కట్టే బట్ట పైన, పాలు , విద్య ,పెన్సిల్, కాగితాలు, స్మశానవాటికల పై పన్నులు వేసి ప్రజలను నిలువు దోపిడిని చేస్తున్నారని ఆరోపించారు. మతం ముసుగులో భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్న బిజెపి విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏ ఐ టీ యూ సీ జిల్లా కోశాధికారి పానెమ్ వెంకట్రావ్, జిల్లా కమిటీ సభ్యులు దొనకొండ వెంకటేశ్వర్లు, గుండె రవి,జానయ్య, నాగరాజు, నగేష్, సైదులు , జానీ, లింగస్వామి, సోమయ్య, రాముడు, ధర్మ, యాదయ్య, కృష్ణ, ఎల్లయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు