క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

డాక్టర్ రవీంద్ర యాదవ్.
తాండూరు నవంబర్8(జనంసాక్షి)క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రవీంద్ర యాదవ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బస్తి దావకానలో ఉచిత టీబీ వ్యాధి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు 206 మందికి  పరీక్షలు నిర్వహించగా అందులో పది మందికి వ్యాధి నిర్ధారణ జరిగిందని తెలిపారు. నిర్దారణ అయిన వారితో పటు కుటుంబ సభ్యులకు సైతం మందులను పంపించేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు వారిని అబ్జర్వేషన్ చేస్తూ ఆరు నెలలకు సరిపడే మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ఉచిత మందులను క్రమం తప్పకుండా వాడితే వ్యాధి నయమవుతుందని తెలిపారు. అనంతరం సూపర్వైజర్లు మాట్లాడుతూ రెండు వారాలకు మించిన దగ్గు. జ్వరం. సాయంత్రం సమయంలో జ్వరం రావడం. ఆకలి లేకపోవడం. వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో.డాక్టర్ కిషోర్. డాక్టర్. సౌమ్య. సూపర్వైజర్ బసవరాజ్. ల్యాబ్ సూపర్వైజర్ అరుణ్ కుమార్. సూపర్వైజర్ . నోడల్ పర్సన్ శ్యామల. ఆశా వర్కర్లు ఎన్జీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.