ఖమ్మంలో కానిస్టేబుళ్ల వీరంగం..
ఖమ్మం: జిల్లాలోని మణుగూరులో మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడపడంతో అదుపుతప్పిన కారు పార్క్ చేసివున్న ఇతర కార్లపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు కార్లు, ఓ బైక్ ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు