ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్న చంద్రబాబు పాదయాత్ర
వరంగల్ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర నేడు వరంగల్ జిల్లాలో ముగిసి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనుంది. వరంగల్ జిల్లాలో నేడు పదకొండ రోజు యాత్రను చంద్రబాబు నర్సింహిలపేట నుంచి ప్రారంభించనున్నారు. బకరూపులతండా, దుబ్బతండా, మరిపెడ కార్గిల్ సెంటర్ మీదుగా ఖమ్మం జిల్లా సరిహద్దుల వరకూ యాత్ర సాగనుంది.