ఖమ్మం జిల్లాలో భారీ వర్షం

62ఖమ్మం: జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, సత్తుపల్లి ప్రాంతాల్లో తెల్లవారు జామున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఎదురైంది. పలుచోట్ల మిర్చి పంట, మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం బీభత్సానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.