ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి అరుదైన గుర్తింపు
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అరుదైన గుర్తింపు సాధించింది. పరిశుభ్రతతో పాటు మెరుగైన వైద్యం అందిస్తున్నందుకు కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. పేదరోగులకు అందిస్తున్న సేవలకు గాను తమ ఆస్పత్రికి అవార్డు లభించడంపై సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ స్ఫూర్తితో సేవలు మరింత విస్తృతపరుస్తామని తెలిపారు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ఇపుడు యావత్ తెలంగాణలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాయకల్ప పథకం లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పరిశుభ్రతతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించే హాస్పిటాల్స్ ను ప్రోత్సాహించేలా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర బృందాలు నాలుగు విడతలుగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ను సందర్శించాయి. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఈ దవాఖానను అవార్డుకు ఎంపిక చేశాయి…స్పాట్కాయకల్ప అవార్డ్ కు ఎంపికవ్వడంతో తమ పై మరింత బాధ్యత పెరిగిందని హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. అవార్డు కింద కేంద్రం అందించే 50 లక్షల నగదుతో హాస్పిటల్ ను ఇంకా అభివ్రుద్ది చేస్తమంటున్నారు. రోగులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అన్ని చేస్తామని చెబుతున్నారుగవర్నమెంటు హాస్పిటల్ అనగానే అక్కడి అపరిశుభ్ర వాతావరణమే గుర్తుకొస్తుంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, మందుల వాసన, తుప్పు పట్టిన మంచాలు, కంపుకొట్టే బాత్ రూంలు, గోడలపై ఉమ్మిన మరకలు అక్కడ కామన్ గా ఉంటాయి. ఇక డాక్టర్లు, సిబ్బంది లేక పేషెంట్ల అవస్తలు వర్ణనాతీతం. కానీ ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మంచి ట్రీట్‌మెంట్ లభిస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రిని మించిన సేవలను ఇక్కడి వైద్యులు అందిస్తున్నారు. హాస్పిటల్ సందర్శనకు వచ్చిన కేంద్ర బృందం వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంది. కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసింది.