ఖరగ్‌పూర్‌ ఐఐటీకి హిమబిందు ఎంపిక

శ్రీకాకుళం, జూలై 18: ప్రతిష్ఠాత్మకమైన ఖరగ్‌పూర్‌ ఐఐటీకి జిల్లాలోని పొందూరుకు చెందిన నల్లి హిమబిందు ఎంపికైయ్యారు. ఈ నెల 20న ప్రవేశం పొందాలని ఆమెకు సమాచారం అందింది. బయోటెక్‌, బయోకెమికల్‌ విభాగంలో ఆమె చేరాల్సి ఉంది. ఈమె జవహర్‌ నవోదయ(వెన్నెలవలస)లో చదువుకుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌లో 12వ తరగతి చదివి 970 మార్కులు సాధించుకుంది. హిమబిందు అఖిలభారత స్థాయిలో 2,782వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి రామకృష్ణ ఎస్‌బీఎస్‌వైఎం డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ సహాయకునిగా పనిచేస్తున్నారు. ఈమె ఏటా రూ. 65 వేల ఉపకారవేతనం పొందేందుకు కూడా ఎంపిక కావడం విశేషం. అలాగే భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సమకూర్చే ఉపకార వేతనానికి సైతం హిమబిందు అర్హత సాధించారు.