గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం
జగిత్యాల,నవంబర్11(జనంసాక్షి): గొల్లపల్లి మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కిష్టంపేట రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలాపూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. అనంతరం పలువురు మైనార్టీసెల్ కమిటీ సభ్యులు ఇమ్రాన్,నాయీమ్,సాదిక్,ఆయూబ్,అబిద్,అస్లాం తదితరులు నియమించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైర నర్సయ్య సమక్షంలో 100 మంది మైనార్టీ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం క షి చేస్తాం అని అన్నారు.ఈకార్యక్రమంలో కల్లెపెల్లి తిరుపతి, బాలే తిరుపతి ,గడ్డం రవి ,బాలే రాజు, కాసా గంగాధర్ బైర నర్సయ్య సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




