గడప గడపకు రైతు డిక్లరేషన్ లోయపల్లి గ్రామంలో రైతు రచ్చబండ పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 06 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీతోనే రైతులు, అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతారని మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని లోయపల్లిలో జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంత రావు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, కొత్త కుర్మ శివ కుమార్, దండెం రాంరెడ్డి, ఇతరులు పాల్గొన్నారు. హనుమంతరావు ఇతరులు మాట్లాడుతూ..సోనియా గాంధీ ఇచ్చిన మాట మేరకు తెలంగాణను..ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించిందని తెలంగాణ వస్తే కేసీఆర్ తాను ముఖ్యమంత్రిని కానని దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూములు ఇస్తామని ఇచ్చిన హామీని తెరాస ప్రభుత్వం నిలుపుకోలేదన్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీలను ఎంత మందికి నెరవేర్చిందో చెప్పాలని తెరాస ప్రభుత్వం వీటి అమలులో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. మోసపూరితమైన హామీలను ఇచ్చే టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయకూడదని కోరారు. గ్రామాల్లో బడుగుబాలహీన వర్గాల వారికి ఇందిరమ్మ అసైన్డ్ భూములు ఇస్తే తిరిగి వాటిని కూడా లాక్కుంటున్నారని అన్నారు. గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తుచేశారు. మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా మహిళలకి 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మార్పు తీసుకొచ్చింది తామే అన్నారు. ఇటీవల మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల మానభంగాలు పెరిగిపోతున్నాయని జూబ్లీ హిల్స్ లో ఓ బాలికపై జరిగిన అత్యాచారాన్ని గుర్తుచేశారు. ఆడపిల్లలు, మహిళల పట్ల జరిగే అఘాయిత్యాలపై మౌన వ్రతం చేస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని అన్నారు. అనంతరం రెండు నిమిషాలపాటు మౌన వ్రతం పాటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు, ఎస్సి, ఎస్టీ, బీసీలకు ప్రాముఖ్యంగా రైతులకు అన్ని వర్గాల ప్రజలకు వరంగల్ డిక్లరేషన్ అంశాలన్నింటిని అమలు చేస్తామని ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి రూ. 15 వేలు, రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు మెరుగైన పంటల బీమా, ధరణి పోర్టల్ రద్దు చేసి మెరుగైన రెవిన్యూ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతీ రామ్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, జానయ్య ,సత్తయ్య, జంగయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎన్ఎస్యూఐ నాయకులు, ఎంఎన్ఆర్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, ఎమ్ఎన్ఆర్ టీమ్ సభ్యులు, రైతులు, పాల్గొన్నారు.