గడప గడప కు బి ఆర్ ఎస్ సంక్షేమ పధకాలు.

బూర్గుం పహాడ్ అక్టోబర్ 31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం లో రాష్ట్ర ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక శాసన సభ్యులు, పినపాక బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు గెలుపే లక్ష్యంగా గడప గడప కు బి ఆర్ ఎస్ సంక్షేమ పధకాలను వివరించి రేగా గెలుపును ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని 230 బూత్ లోని గౌతమీపురం కాలనీ లో గడప గడపకు బిఆర్ఎస్ మనిఫాస్టో ను వివరిస్తూ డోర్ టూ డోర్ స్టికర్స్ అంటిస్తూ.. కారు గుర్తుపై ఓటు వేసి రేగా కాంతారావు ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అదితిగా మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎన్నికల మండల ఇంచార్జి అన్వర్ పాల్గొన్నారు. కాలనీ లోని ఓటర్ల తో మాట్లాడుతూ కార్ కు ఓటు వేసి అభివృద్ధి కి సహకరించాలని, దేశం లో ఎక్కడ లేని సంక్షేమ కార్యక్రమలు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ప్రజా రంజకమైన మేనిఫెస్టో వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భూపల్లి నర్సింహారావు, పట్టణ అధ్యక్షులు సోహెల్ పాషా, మండల మైనారిటీ అధ్యక్షులు సాదిక్, నాయకులు ఈసంపల్లి వెంకటేశ్వర్లు, షోకత్ అలీ, కేసుపాక రామ కృష్ణ, నాగరాజు, శ్రీను మరియు కాలనీ బిఆర్ఎస్ యూత్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.