గడ్చిరోలిని సందర్శించిన సీఆర్పీఎఫ్ చీఫ్
నాగ్‌పూర్:సీఆర్పీఎఫ్ డైరక్టర్ జనరల్ ప్రణయ్ సహాయ్ మహారాష్ట్రలోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలిని సందర్శించారు. ఆయన గడ్చిరోలికి 40 కిలోమీటర్ల దూరంలోని పెంద్రీ ఔట్‌పోస్టును సందర్శంచారు. ఆయన పర్యటన వివరాలను చివరి వరకు గోప్యంగా ఉంచారు. గత మార్చిలో సీఆర్పీఎఫ్ చీఫ్ విజయ్‌కుమార్ పర్యటన సందర్భంగా నక్సల్స్ దాడులను దృష్టిలో ఉంచుకోని ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. సహాయ్ తన పర్యటన సందర్భంగా భద్రతా దళాలతో సమావేశమయ్యారు. ఈసమావేశానికి రాష్ట్రంలోని సీనియర్ పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారులు హాజరయ్యారు.



