గడ్డం వెంకట నర్సమ్మ విప్లవ జోహార్లు

టేకులపల్లి, జూన్ 22( జనం సాక్షి ): ప్రజా పంథా పార్టీ నాయకురాలు కామ్రేడ్ దొరన్న జీవిత సహచరి గడ్డం వెంకట నర్సమ్మ భౌతికంగా మనకు దూరమవ్వడం బాధాకరమని మహిళ గా తను ప్రదర్శించిన విప్లవ చైతన్యం స్ఫూర్తిదాయకమని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా టేకులపల్లి మండల కార్యదర్శి డివిబి చారి,మండల నాయకులు జర్పుల సుందర్, పీ వై ఎల్ నాయకులు నోముల భానుచందర్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. సాయుధ రైతాంగ పోరాట వీరుడు గడ్డం వెంకటరామయ్య   (దొరన్న) ,సతీమణి గడ్డం వెంకట నర్సమ్మ బుదవారం ఉదయం తెల్లవారు జమున అమరులు అయ్యారని వారు చిన్న వయసులోనే అంటే ఎనిమిదవ ఏట కామ్రేడ్ దొర అన్న తో పెళ్లి అయింది.కామ్రేడ్ దొరన్న నాయకుడిగా అటవీ ప్రాంతంలో పని చేస్తున్నప్పుడు శత్రువు నిఘా  కుటుంబం పై అనునిత్యం ఉండేది .1996 పెత్తళ్ళగడ్డ లో కామ్రేడ్ దొరన్న ఇంటిని పోలీసులు కాల్చివేశారని,ఆ తరువాత ఖమ్మం పట్టణానికి వచ్చారఅన్నారు. ఖమ్మం వచ్చిన తర్వాత  కుటుంబపోషణ కుటుంబ సభ్యుల సహకారంతో   బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రగతి శీల  మహిళా సంఘంలో చేరి మహిళల హక్కులకోసం పోరాటం కొనసాగించింది. మహిళ హక్కులపై పోరాటంలు చేసి ఖమ్మం పట్టణ నాయకురాలిగా ఏదిగారన్నారు.  వెంకట నర్సమ్మ కామ్రేడ్ దొరాన్న  మరణానంతరం  వృద్ధాప్యం ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినా ఓపిక ఉన్నంతవరకు పార్టీ కోసం ప్రజల కోసం పోరాడుతూనే చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఎందరో నాయకులకు ఆదర్శంగా నిలిచిన ఆమె గొప్ప యోధురాలు అని విప్లవ జోహార్లు తెలిపారు .తన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలని వారు అన్నారు. టేకులపల్లి మండలం నుండి కొంతమంది నాయకులు గడ్డం వెంకట నరసమ్మ భౌతికకాయాన్ని సందర్శించి జోహార్లు అర్పించారు.