గణేష్ ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

యాచారం సి ఐ లింగయ్య

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి) యాచారం మండలంలోని ప్రజలు వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని యాచారం సి ఐ లింగయ్య అన్నారు ఈ సందర్భంగా యాచారం లో  సిఐ మాట్లాడుతూ గ్రామాల్లో మండపాలు, పందిళ్ళు ఏర్పాటు కోసం పోలీస్ స్టేషన్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని  తెలిపారు. ఈ నెల 31న వినాయక చవితి సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతులు పొందాలని  తెలిపారు. ముఖ్యంగా విగ్రహ ఏర్పాటుదారులు అధికారులు నిర్దేశించిన నిబంధనల మేరకు నడుచుకొని వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్ట నాటి నుండి ఎన్ని రోజులపాటు పూజలు జరుపుతున్నారో, నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసు వారికి తెలియజేయాలని అన్నారు ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని  తెలిపారు.