గణేష్ మండపాలకు పోలీసు వారి అనుమతి తప్పనిసరి
టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ భూక్య శ్రీనివాస్
టేకులపల్లి, ఆగస్టు 28( జనం సాక్షి): వినాయక చవితి సందర్బంగా మండలములో గణేష్ విగ్రహాలను ప్రతిష్టించే వారు తప్పనిసరిగా టేకులపల్లి పోలీసు వారి అనుమతి తీసుకోవాలని టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ భూక్య శ్రీనివాస్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించే ఆర్గనైజేషన్ పేరు, అధ్యక్షుని పేరు, ఫోన్ నంబర్లు వినాయకుని ఉత్సవ కమిటిలోని సభ్యుల పేర్లు తప్పనిసరిగా తెలియపరచాలన్నారు. మైక్ అనుమతి, విద్యుత్ శాఖా నుండి విద్యుత్ సరఫరా కొరకు అనుమతి తీసుకోవాలని, ఊరేగింపులకు వాహన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, నవరాత్రులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన అన్నారు.