గద్వాలలో అస్వస్థతకు గురైన పట్టణ వాసులను పరామర్శించిన :- జెడ్పి చైర్ పర్సన్ సరిత
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు
గద్వాల రూరల్ జూలై 06 (జనంసాక్షి):- గద్వాల పట్టణంలోని వేదనగర్ ,గంటవీధి ,ధరూర్ మెట్టు,కృష్ణారెడ్డి బంగ్లా ప్రాంతాల్లో కొద్దిరోజులుగా కలుషిత నీరు సరఫరా వల్ల ఆయా కాలనీ వాసులు అస్వస్థతకు గురయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న కథనానికి స్పందించిన జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ బుధవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు…అస్వస్థతకు గురైన బాధితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు, జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ వైద్య సిబ్బందితో మాట్లాడుతూ కలుషిత నీరు తాగడం వలన అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకుని, అస్వస్థతకు గురైన బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, నయం అయ్యే వరకు ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని సూచించారు,సంబంధిత అధికారులతో మట్లాడి కాలనీలో మంచినీటి సరఫరా అయ్యేలా మాట్లాడి స్వచ్ఛమైన నీరు అందించే విధంగా కృషి చేస్తామని ఆయా కాలనీ వాసులకు జెడ్పి చైర్ పర్సన్ హామీ ఇచ్చారు… వీరి వెంట ఇమ్మానేయిల్, ధరూర్ రవి,నాగరాజు,పరుశ,రమేష్ తదితరులు ఉన్నారు…