*గద్వాలలో బిజెపి,టీఆర్ఎస్ మధ్య యుద్ధం మొదలైంది*

గద్వాల నడిగడ్డ, జులై   (జనం సాక్షి);
  రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒకపక్క టిఆర్ఎస్ మరోపక్క బిజెపి నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
గురువారము డికె బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు బండల వెంకటరాములు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామాంజనేయులు మాట్లాడుతూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చర్చలకు వస్తే మేము సిద్ధంగా ఉన్నామని రాజకీయ బిచ్చగాళ్లు, రాజకీయ బ్రోకర్లు మాట్లాడితే సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదని, మునిసిపల్ చైర్మన్ కు డి కే అరుణ రాజకీయ బిక్ష పెట్టారని, కరోనా బిళ్ళంటూ కోటి రూపాయల బిల్ పెట్టుకుని దోచుకున్న దానిమీద మున్సిపల్ చైర్మన్ బహిరంగ చర్చకు సిద్ధమేనా అనీ వారు సవాల్ విసిరారు. టిఆర్ఎస్ చేస్తున్న దొంగ దందాలు ఇసుక, డూప్లికేట్ లిక్కర్, గవర్నమెంట్ పొలాలు లాక్కోవడం, కాంట్రాక్టర్లు వస్తే వారిని బెదిరించడం, ప్రతి పనిలో కమిషన్ దండుకోవడం అధికారులను దుర్భాషలాడడం, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తీసుకున్న పనులలో నాణ్యత లేకుండా పనులు చేయడం, సొంతగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బెదిరించి కమిషన్లు ఇవ్వలేదని బెదిరించడం, మంది ఆస్తులు తాకట్టుపెట్టి బ్యాంకు లోన్ తీసుకోవడం, పాత వెంచర్ల ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా లాక్కోవడం, ఇసుకను ఆపి భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టడం, భూగర్భ శాఖ కార్యాలయం అనుమతి లేకుండా మట్టిని అమ్మి కోట్లు సంపాదించుకోవడం, పేదల ప్లాట్లపై కక్షపూరితంగా లాక్కొని అక్కడే నర్సింగ్ కాలేజ్ కడతామని పనులు మొదలుపెట్టడం, ప్రజలకు ఇబ్బంది పెట్టే పదవులలో సాగిస్తున్న మీరే మాట్లాడితే మరి అరుణమ్మ ప్రజలకు ఎలా ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తున్న మేము మీ గురించి మాట్లాడే ప్రజలు మిమ్మల్ని తరిమికొడతారని ,అది త్వరలో  తరిమికొట్టే రోజు దగ్గరలో ఉందని నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలని తస్మాత్ జాగ్రత్త అని వారు అన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదని రాజకీయంగా 20 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న మా అధ్యక్షుడు సొంతంగా ఎదిగి నేటి వరకు ఎవరితోనన్నా కనీసం ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తారా ?పెయిడ్ ఆర్టిస్టు అంటారా పదవుల కోసం ఎంతైనా దిగజారే చెత్త నాయకులు మాట్లాడితే మీ బతుకు బయట పెట్టి రోడ్డున పడేస్తాం జాగ్రత్త ఖబర్దార్ అని వారి సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతినిధి నాగేందర్ యాదవ్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ చిత్తారి కిరణ్, జిల్లా కార్యదర్శి మాల శ్రీనివాసులు, కౌన్సిలర్లు త్యాగరాజు, రజక జయశ్రీ, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు భారతి, బిజెపి సీనియర్ నాయకులు సంజీవ్ భరద్వాజ్, తుమ్మల నరసింహులు ,వెంకటేష్ యాదవ్ ,హేమాకర్ తదితరులు ఉన్నారు.
Attachments area