గద్వాల జిల్లా చేయాలి

3

– 3 రోజుల బంద్‌కు పిలుపు

గద్వాల,ఆగస్టు 25(జనంసాక్షి):జిల్లాల పునర్విభజనలో భాగంగా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిరవధిక బంద్‌కు జిల్లా సాధన సమితి, అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నాయకులు గురువారం ప్రత్యేకంగా సమావేశమై కార్యాచరణ రూపొందించారు.ఇప్పటికే గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో విధించిన 144 సెక్షన్‌ ఎత్తివేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ బంద్‌కు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. నడిగడ్డ ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించి గద్వాలను జిల్లా చేయాలని అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు.