గర్జల్ గ్రామంలో పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

_ జనంసాక్షి జులై
 రోజు గాంధారి మండల పరిధిలోని  గుర్జల్  గ్రామ పరిధిలోని మొక్క జొన్న, సోయాబీన్ పంటలను పరిశీలించడం జరిగింది మొక్క జొన్న,సోయాబీన్, ప్రత్తి మరియు కంది పంటలకు వరుసగా కురుస్తున్న వర్షాలకు నష్టం జరగకుండా వుండడం కోసం పంట పోలాలలో నీరు నిల్వ ఉండకుండా విలు వున్న చోట నీరు సాఫీగా వెళ్ళే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని మనవి. వర్షాలు పూర్తీగా తగ్గిన తర్వాత పంటలు తొందరగా కోలుకోవడానికి ఫార్ములా 4 మరియు 19.19.19 లాంటి పోషకాలను లీటర్ నీటికి 3-5 గ్రాములు  లేదా నానో యూరియా 2 మీ లి లీటర్ నీటిలో కలిపి లేదా 13.0.45 ఎకరానికి 1 కేజీ పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదే విదంగా వరుసగా కురుస్తున్న వర్షాల వలన పంటలకు తెగులు సోకే అవకాశం వుంటది కావున వర్షాలు పూర్తీగా తగ్గిన తర్వాత మాన్కోజెబ్+ కార్బెండజిమ్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి అని రైతు సోదరులకు విజ్ఞప్తి.   ఈ కార్యక్రమంలో రైతులు  మరియు ఏ ఈ ఓ విజ్ఞేష్ మరియు VRA షాదుల్లా, కుమార్ పాల్గొన్నారు.
Attachments area