*గర్భిణీలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.

 చిట్యాల 20(జనంసాక్షి) గర్భిణీలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలని సిడిపిఓ అవంతి అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపూర్ తండాలో పోషకార మాసోత్సవాలు గ్రామ సర్పంచ్ బానోతు జవహర్లాల్  అధ్యక్షత కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సిడిపిఓ అవంతి  హాజరై పోషకాహార ప్రాముఖ్యత గూర్చ వివరించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని గ్రామ పంచాయతీలలో ఉన్న మహిళలు, కిశోర బాలికలు, పిల్లలలో పోషకాహార లోపాన్ని , రక్తహీనతను తగ్గించుటకు ప్రతి గర్భవతి నార్మల్ డెలివరీ అగుటకు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు వ్యక్తిగత శుభ్రత త్రాగే నీటి ని వడగట్టి కాచి చల్లార్చిన నీరు తాగాలని, పరిసరాలన్నీ పరిశుభ్రంగా పెట్టుకోవాలని, ఏ పని చేసినా పెద్దలు పిల్లలు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా కిషోర్ బాలికలు బాలురు మొబైల్ ఫోన్లకి దూరంగా పెట్టాలని, చదువు పైన శ్రద్ధ కల్పించాలని  తల్లిదండ్రులు వారికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించినప్పుడే నేటి బాలలు రేపటి పౌరులుగా తీర్చిదిద్దవచ్చును  పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని చిన్నప్పటినుండే క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని, తప్పనిసరి గర్భవతులు బాలింతలు అంగన్వాడీ కేంద్రంలోని భోజనం చేయాలని సూచించారు. అనంతరం ముగ్గురు గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించి,ఒక పాపకు అన్నప్రాసన చేసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో మెడికల్ ఆఫీసర్ నాగరాణి,  హెల్త్ సూపర్వైజర్ సుభద్ర, ఉప సర్పంచ్ సునీత, కార్యదర్శి సరిత,ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద ,అంగన్వాడీ టీచర్స్ రజిత, మంగ ,లక్ష్మి, ఉమాదేవి, భారతి, హెల్త్ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.