గర్ల్ ఫ్రెండ్ కోరికలు తీర్చేందుకు దొంగగా మారి…. పోలీస్‌లకు చిక్కిన యువకుడు
-పనిచేస్తున్న సంస్థలోకే చొరబడి లాకర్ ఎత్తుకెల్లిన వైనం
-అతివేగంగా చేదించిన వన్ టౌన్ పోలీస్‌లు
-లాకర్ సహా లక్షా 93వేల నగదు స్వాదీనం
-నిందితుడిని విూడియా ముందు ప్రవేశపెట్టిన పోలీస్‌లు
-వివరాలు వెల్లడించి ఎసిపి రామారావు
కరీంనగర్,అక్టోబర్ 23(జనంసాక్షి): కరీంనగర్‌లో ఓ ప్రబుద్దుడు తాను ప్రేమిస్తున్న యువతికోసం గతంలో పనిచేసిన కార్యాలయంలోనే దొంగతనం చేసి క్యాష్ లాకర్‌ను ఎత్తు కొచ్చిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా సీసీటీవీలో రికార్డు కావడంతో కేవలం మూడురోజుల్లోనే దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీస్‌లు అరెస్ట్‌చేసి విూడియా ముందు ప్రవేశపెట్టారు. కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ముందు ప్రాంతంలో ఓ షెటర్‌లో ఉన్న ఆన్‌లైన్ షాపింగ్ సెంటర్ షాపులో గతంలో పనిచేసి ప్రస్తుతం గోదావరిఖనిలో ఉద్యోగం చేస్తూ నగరంలోనే భగత్/-నగర్‌లో మిత్ర అపార్ట్‌మెంట్‌లో అదే యువతితో సహజీవనం చేస్తున్న ఆమె కోసం దారుణానికి ఒడి గట్టాడు. రాత్రి సమయంలో దుకాణం మూసి వేసిన తర్వాత షట్టర్ తాళాన్ని కోసేసి లోపలికి వెల్లే ముందు మొహం సిసి కెమెరాలలో రికార్డు అయినా గుర్తు పట్టకుండా ఉండే విదంగా చేతి రుమాలుతో కప్పుకుని లోనికి వెల్లి లాకర్‌కు లాకర్‌నే తొలగించి తీసుకెల్లాడు అజయ్ .ఇది 19వతేదీన జరిగింది. వెంటనే పోలీ స్‌లు రంగ ప్రవేశం చేసి నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్నారు వన్ టౌన్ సిఐ తులా శ్రీనివాసరావు నేతృత్వం లోని బృందం. అయితే అజయ్ తెలివిగా సీసీ కెమెరాల డీవీఆర్ సిస్టమ్‌లో డిస్ కనెక్ట్ చేశాడు, అయితే పోలీస్‌లు ఇదే డోలివరి ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో పనిచేసిన, చేస్తున్న వ్యక్తులను అనుమానించి విచారించగా అజయ్‌గా గుర్తించారు కార్యాలయ మేనేజర్, పోలీస్ లు, వెంటనేరంగంలోకి దిగినపోలీస్‌లు అజయ్‌మూవ్‌మెంట్స్‌ను గమనించిఆదివారం ఉదయంమంచిర్యాల చౌర స్తాలో పట్టుకుని విచారిం చగా నేరాన్ని అంగీక రించాడు. దీంతో అతనివద్దనుంచి దొంగిలించిన లాకర్‌సహా అందులోని లక్షా93వేల 880 రూపాయల నగదు కూడా స్వాదీనంచేసుకున్నా రు. లాకర్ తొలగించడా నికి వినియోగించిన స్కూడ్ర్రైవర్ సుత్తె, తదితర వస్తువులను స్వాదీనం చేసుకుని విూడియా ముందు ప్రవేశపె ట్టారు.సంఘటన వివరాలను నగర ఎసిపి రామారావు విూడియాకు వివరించారు. అయితె చోరి కి గురైన 1లక్షా93వేల880 రూపాయల నగ దు ప్రతిరూపాయి కూడా రికవరీ చేశారు. ఇతడిని సోమవా రం కోర్టులో ప్రవేశపెడతామని ఎసిపి వెల్లడించారు. నిందితు డు అజయ్ డిగ్రీ వరకు ప్రైవేట్ కళాశాల లోచదువుకుని ఆన్‌లైన్‌షాపులో డెలివరీ బాయ్‌గా పనిచేశాడు,. అయితే 2016 మేలో ఇతనికి అసిస్టెంట్ మేనేజర్ గా పదోన్నతినిసంస్థ కల్పించి రామగుండంకు బదిలీచేయగా ప్రస్తుతం కరీంనగర్ మండలంరేకుర్తి స్వగ్రామమైనప్పటికి నగరంలోని భగత్ నగర్‌లో తానుచదువుకున్న కళాశాలలో ఓఅమ్మాయితో ప్రేమాయణంసాగిస్తూ ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు. ఆమెకోర్కెలు తీర్చేం దుకుగాను ఇప్ప టికే రామగుండం కార్యాలయంలో సుమారు లక్షన్నర వరకు దుర్వినియోగం చేశాడని, అయినా ఆమెకోరికలు తీర్చేందు కు డబ్బు సరిపోకసోవడంతో గతంలో పనిచేసిన కరీంనగర్‌లోని డెలివరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో దొంగ తనానికి ఒడిగట్టాడని ఎసిపి రామారావు తెలిపారు. దొంగను పట్టుకున్న టీంలోని సిఐ, ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, పిసి రాజగో పాల్ రెడ్డి, రాజు, లక్ష్మి నర్సయ్య, పి మనోహర్, కనకయ్య, రమేశ్, సుధాకర్ రెడ్డి, ¬ంగార్డు
అనితలకు రివార్డు ఇప్పించనున్నామని ఎసిపి రామారావు వెల్లడిం చారు. విూడియా సమావేశంలో వన్‌టౌన్ సిఐ తులా శ్రీనివాసరావు, ఎస్‌ఐ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.