గవర్నర్‌ నిర్ణయమే ఇప్పుడు కీలకం

పాట్నా,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
: బిహార్‌ రాజకీయాలు తాజాగా మరో మలుపు తిరిగాయి. వర్నర్‌ తసీఉకునేనిర్ణయం కోసం నితీష్‌ కుమార్‌ ఎదురు చూస్తున్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులను చంపుతామంటూ పలువురు బెదిరించారని, అందుకే తాను రాజీనామా చేశానని మాంఝీ పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు గవర్నర్‌ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.  భాజపా గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చి డ్రామాలాడుతోందిని, సిఎం  రాజీనామా అనంతర పరిణామాలపై ఇప్పుడే మాట్లాడలేమని నితీశ్‌ కుమార్‌ అన్నారు. గతంలో తాను తొందరపడి రాజీనామా చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, అందుకు ప్రజలు తనను క్షమించాలని నితీశ్‌ పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయనన్నారు. ప్రస్తుతం బిహార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి జేడీయూ నేత నితీష్‌కుమార్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఎప్పుడైతే నితీష్‌ కుమార్‌ భాజపాతో సంబంధాలు తెంచుకొని ఆర్‌జేడీతో పొత్తు కుదుర్చుకున్నారో అప్పటి నుంచి బిహార్‌లో శాంతిభద్రత సమస్యలు నెలకొన్నాయని గిరిరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బిహార్‌ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌ కెఎన్‌ త్రిపాఠిపై పడింది.