గవర్నర్ సీఎంలతో ఆర్మీ చీఫ్ భేటీ మర్యాదపూర్వకమా ? తెలంగాణ ఇచ్చాక పరిణామాలపై చర్చా ?
హైదరాబాద్, జనవరి 5 (జనంసాక్షి):
భారత సైనిక దళాధిపతి విక్రమ్‌సింగ్ శనివారం నాడు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ ఉదయం హకీంపేట నుంచినేరుగా ఆయన సచివాలయానికి చేరుకుని సమతా బ్లాక్‌లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దాదాపు 15 నిమి షాలపాటు ఈఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఆర్మీకి భూ కేటాయింపుల వ్యవహారంపై చర్చించారని అధికారులు తెలిపారు. అనంతరం విక్రమ్ సింగ్ రాష్ట్ర గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్రివిధ దళాధిపతులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలవడం సాధారణమే. అయినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సైనిక దళాధిపతి పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పైగా ఆయన ముఖ్యమంత్రితో కలవడం మరింత ఆశక్తిని రేపింది. సైనిక దళాధిపతి గవర్నర్, ముఖ్యమంత్రితో జరిపిన చర్చలలో ఆర్మీ సంబంధ విషయాలే కాక, రాష్ట్రంలోని పరిస్థితులు