గాంధీజి చూపిన మార్గంలో ముందుకు సాగాలి.

కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు వెడ్మ భోజ్జు .

జనం సాక్షి ఉట్నూర్.

జాతీయ పితా మహాత్మా గాంధీ జయంతిని ఉట్నూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి నరసయ్య అధ్యక్షతన పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహనీయుడు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేడ్మ భోజ్జు పటేల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి చేసిన త్యాగం బ్రిటిష్లను దేశం నుండి తరిమి కొట్టిన విధానాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గంలో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు సలీం దేవానంద్ ఇమ్రాన్ పరమేశ్వర్ నగేష్ తదితరులు ఉన్నారు.