గాంధీభవన్ లో ఒబిసి సెల్ సమావేశంకు కదిలిన జనగామ కాంగ్రెస్ శ్రేణులు – జనగామ జిల్లా ఒబిసి సెల్ అధ్యక్షులు లోక్కుంట్ల ప్రవీణ్
గాంధీభవన్ లో ఒబిసి సెల్ సమావేశంకు కదిలిన జనగామ కాంగ్రెస్ శ్రేణులు – జనగామ జిల్లా ఒబిసి సెల్ అధ్యక్షులు లోక్కుంట్ల ప్రవీణ్ జనగామ (జనం సాక్షి )ఆగస్ట్8: టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు గాంధీభవన్ లో ఒబిసి సెల్ సమావేశం ఏర్పాటు చేయగా జనగామ జిల్లా ఒబిసి సెల్ అధ్యక్షులు లోక్కుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా నుంచి కదిలిన కాంగ్రెస్ నాయకులు జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించిన జనగామ జిల్లానాయకులు ఉడత రవి యాదవ్.అనంతరం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నిడికొండ శ్రీనివాస్ ఓబిసి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రె రాజశేఖర్ జిల్లా నాయకులు రాపోలు రామ్మూర్తి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చే విధంగా బిసిల అందరం ఒక్కతాటిపైన ఉండి పోరాటం చేస్తాం అని బిసిలకు న్యాయం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ మండల అధ్యక్షులు మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.