గాంధీ జయంతి సందర్భంగా ముగ్గుల పోటీలు

పెద్ద వంగర అక్టోబర్ 02(జనం సాక్షి )భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్బంగా బావోజీ తండాలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆదివారం గాంధీ జయంతి సందర్బంగా బావోజీ తండా గ్రామపంచాయతీలో ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన వారికీ స్థానిక సర్పంచ్ బానోత్ జమున గోపాల్ ఆధ్వర్యంలో బహుమతులుగా టిఫిన్ బాక్స్ లను తెరాస మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య చేపంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి బిర్రు పరమేష్,గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ శ్రీనివాస్, కార్యదర్శి జాటోత్ సీతారాం, మహిళాలు జాటోత్ రాజమ్మ, జాటోత్ కమలమ్మ, జాటోత్ అనిత,జాటోత్ పద్మ, జాటోత్ విమల,ధరవత్ బిందు, ధరవత్ నిత్య,జాటోత్ కళ్యాణి, నాయకులు జాటోత్ రాజు, జాటోత్ వెంకన్న పాల్గొన్నారు.