గాంధీ సినిమాకు విశేష స్పందన

 జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 9 నుండి జిల్లాలో ప్రదర్శించిన గాంధీ సినిమాను 64,924 మంది విద్యార్థులు తిలకించారని, గాంధీ సినిమా విద్యార్థులలో మంచి స్ఫూర్తిని నింపిందని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని , స్వతంత్ర స్ఫూర్తిని పెంపొందింపజేసేందుకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 9 నుండి 11 వరకు , అలాగే 16 నుండి 21 వరకు సినిమా థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శించినట్లు తెలిపారు.మొదటి రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నవ్య థియేటర్ లో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ , మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ , డిఈ.ఓ అశోక్ , డిఎస్పీ నాగభూషణంలతో కలిసి తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను కొద్దిసేపు వీక్షించారు.జిల్లా వ్యాప్తంగా 14 థియేటర్లలో  520 స్కూళ్లకు చెందిన విద్యార్థులు గాంధీ సినిమాను తిలకించినట్లు వెల్లడించారు.ఈ సినిమా ద్వారా ఎంతో మంది విద్యార్థులు స్పూర్తి పొందారని తెలిపారు.