*గాంధేయ మార్గం అందరికీ ఆదర్శం.ఎంపీపీ జ్యోతి, జెడ్పీటీసీ నరసయ్య*

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.గాంధేయ మార్గం అందరికి ఆదర్శం, అనుసరణీయమని ఎంపీపీ లకుమళ్ళ జ్యోతి బిక్షం,జెడ్పీటీసీ రాపోలు నరసయ్య  పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని సందర్బంగా ఆదివారం ఎంపిడివో కార్యాలయంలో  మహాత్మగాంధీ,చిత్ర పటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ రాపోలు నరసయ్య మాట్లాడుతూ,అహింసా, సత్యాగ్రహంను ఆయుధంగా మల్చుకుని భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆదర్శనీయులు మహాత్మా గాంధీ అని.అహింసా మార్గంలోనే సుదీర్ఘ పోరాటం చేసి ఆంగ్లేయులను పారద్రోలి దేశానికి స్వేచ్చా స్వాతంత్ర్యాలు సాధించి పెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో శంకరయ్య, ఎంపివో విజయ కుమారి,వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ,ఎంపీటీసీ లింగయ్య యాదవ్, ఏపీవో శేఖర్,ఎంపిడివో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.