గాజాపై విరుచుకుపడతాం
` హమాస్‌ను అంతమొందిచడమే మా లక్ష్యం
` ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
జెరూసలెం (జనంసాక్షి):పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. గాజాపై భూతల దాడులకు సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడిరచారు. అయితే గ్రౌండ్ ఆపరేషన్ ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలను ఆయన స్పష్టం చేయలేదు. నెతన్యాహు ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయల్ దళాలు ప్రవేశించడంపై ప్రభుత్వ ప్రత్యేక వార్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.తాము గాజాపై భూతల దాడులకు ఏర్పాట్లు చేస్తున్నామని, అయితే గ్రౌండ్ ఆపరేషన్ ఎలా, ఎప్పుడు చేపడతామనే వివరాలు తానిప్పుడు వెల్లడిరచలేనని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వేలాది ఉగ్రవాదులను మట్టుబెట్టిందని ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు.కాగా, ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా సాయుధ మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర పోరు ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఇరు పక్షాల మధ్య యుద్ధం బుధవారం 18వరోజుకు చేరింది.గాజా స్ట్రిప్‌లో భూతల దాడులకు ఇజ్రాయెల్ సంసిద్ధమవుతుండగా వైమానిక దాడులు భీకరంగా సాగుతున్నాయి. హమాస్ స్ధావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భద్రతా దళాలు (ఐడీఎఫ్) రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి.ఇక అలెప్పో అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేపట్టిందని సిరియన్ స్టేట్ టీవీ వెల్లడిరచింది. అలెప్పో అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా మధ్యధరా సముద్రం దిశగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడిరదని సిరియన్ సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో ఎయిర్‌పోర్ట్ రన్‌వే ధ్వంసమైందని సిరియా విూడియా తెలిపింది.
గాజాలో వరదలై పారుతున్న కన్నీళ్లు!
ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజా స్టిప్ర్‌లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇంధన కొరత వల్ల సహా యక చర్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి. క్షిపణుల దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించే అవకాశం లేకుండా పోయింది. వాటికింద చిక్కుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మరోవైపు ఇంధన కొరత వ ల్ల ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు ఆపేస్తున్నారు. క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం పదు ల సంఖ్యలో మృతదేహాలు ఆసుపత్రుల నుంచి శ్మశానాలకు చేరుతున్నాయి. ఈ పరిణామాలపై ఐక్య రాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాకు ఇంధన సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసిం ది. ఇంధనం సరఫరా చేయకపోతే గాజాలో సహాయక చర్యలు అతిత్వరలో పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడిరచింది.
ఇక, గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిలో 14 లక్షల మంది నిరాశ్ర యులయ్యారు. దాదాపు 6 లక్షల మంది ఐక్యరాజ్యసమితి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతు న్నారు. ఈజిప్టు సరిహద్దు నుంచి ఆహారం, నిత్యావసరాలను గాజాకు చేరవేసేందుకు ఇజ్రాయెల్ ఇ టీవల అనుమతి ఇచ్చింది. దాంతో కొన్ని వాహనాలు గాజాకు చేరుకున్నాయి. పరిమి తంగా అందు బాటులోకి వచ్చిన ఆహారం, నిత్యావసర సామగ్రిని రేషనింగ్ విధానంలో పాలస్తీనియ న్లకు సరఫరా చేస్తున్నారు. ఇంధన కొరత మాత్రం తీరడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్‌ను గాజాలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ సైన్యం తెగేసి చెబుతోంది. కాగా, యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ ప్రస్తుతం గాజాలో సహాయక చర్యల్లో నిమగ్నమైంది. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తోంది. విద్యుత్ లేక, పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకపై క్షతగాత్రులకు సేవలందించే పరిస్థితి లేదని చెబుతోంది. ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి కూడా వాహనాలకు ఇంధనం లేదని పేర్కొంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పూర్తిగా చేతులెత్తేయడం తప్ప చేసేదేవిూ లేదని ’యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మూడిరట రెండొంతులు ఇప్పటికే మూతపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మరోవైపు, ఇజ్రాయెల్` హమాస్ మధ్య మొదలైన యుద్ధం మధ్యప్రాచ్యంలో అగ్గి రాజేస్తోంది. హ మాస్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచేవారిని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు సిరియా ప్రభుత్వం మద్దతు పలుకుతుండడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం దక్షిణ సిరియాలోని సైనిక శిబిరాలపై వైమానిక దాడు లు ప్రారంభించింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 8 మంది సిరియా సైనికులు ప్రాణా లు కోల్పోయారు. సిరియా నుంచి తమపై రాకెట్ దాడులు జరుగుతుండడంతో తిప్పికొట్టామని, వైమానిక దాడులు చేసి సిరియా సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే, ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచిన నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ముఖ్య నేత హసన్ నస్రల్లా హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అగ్రనాయకులతో సమావేశమయ్యా రు. తాజా పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్, హెజ్బొల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థలు కలిసి పోరాడే సూచనలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల దాడులకు దిగితే తగిన విూకు గుణపాఠం నేర్పుతామంటూ ఇజ్రాయెల్‌ను హెజ్బొ ల్లా హెచ్చరించింది. హమాస్‌కు ఇరాన్ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఇరాన్‌లోని మిలిటెంట్ సంస్థలు ఇరాక్, యెమెన్, లెబనాన్ భూభాగల నంచి ఇజ్రాయెల్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇక, హమాస్ చెర నుంచి బందీల విడుదల విషయానికొస్తే.. సానుకూల పరిణామాలు చూడొచ్చని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్థానీ చెప్పారు. ఖతార్ మధ్యవర్తి త్వంతో ఇప్పటికే నలుగురు బందీలు విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలినవారిని సైతం విడుదల చేసేలా హమాస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఖతార్ ప్రధానమంత్రి తెలిపారు. బందీల విడుదలకు చొరవ చూపుతున్న ఖతార్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధినేత టాగీ హనెగ్బీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలావుంటే, బుధవారం జరిగిన దాడుల్లో గాజాలో 750 మందికిపైగా జనం మృతిచెందారు. ఇజ్రాయెల్`హమాస్ యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 5,791 మందికిపైగా మరణించారని, 16,297 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. గాజాలోని మృతుల్లో 2,300 మంది మైనర్లు ఉన్నారని వెల్లడిరచింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 96 మంది పాలస్తీనియన్లు బలయ్యారు. 1,650 మంది తీవ్రంగా గాయపడ్డారు.