గాయత్రీ నగర్ రోడ్ నెంబర్4 కాలనీ వాసుల ఆందోళన

50 ఫీట్ల రోడ్డును ఆక్రమించే యత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
కరీంనగర్, అక్టోబర్ 23:-
నగరంలోని 31వ డివిజన్ పరిధిలోని క్యాన్సర్ ఆసుపత్రి వద్దనున్న గాయత్రీ నగర్ రోడ్ నెంబర్4 కాలనీ వాసులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఓ విద్యా పీఠానికి చెందిన కొందరు 50 ఫీట్ల రోడ్ ను ఈభూమి మాదేనంటూ బుకాయిస్తూ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 1957 నుండి కరీంనగర్ మున్సిపల్ గా ఏర్పడ్డ నాటి నుండి దద్దిలమ్మ కుంట కట్టగా నమోదు కాబడి.. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ లో 50 ఫీట్ల రోడ్ గా ఉన్నప్పటికి..లేదు ఈ రోడ్డు 20 ఫీట్ల రోడ్డేనని చెబుతూ ఆక్రమించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తు..ప్రతి కొద్దీ నెలలకు ఒకసారి రోడ్డును కొలతలు చేస్తూ.. ఖనిలు పాతడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఒకసారి ఇదే అంశానికి సంబంధించి రోడ్డు మున్సిపల్ మాస్టర్ ప్లాన్, రోడ్డు పూర్వ పరాలు పూర్తిస్థాయిలో విన్నవించినా.. అప్పటి మందం ఊ అని కొద్ది నెలలు స్తబ్దత గా ఉండి తిరిగి రోడ్డు 50 ఫీట్లది కాదు. 20 ఫీట్లదని వస్తూ అలజడి రేపుతున్నారని దుయ్యబట్టారు. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ లెక్కల స్వప్న వేణుగోపాల్ లు చొరవ తీసుకుని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేసి కాపాడాలని, సైడ్ డ్రైనేజీలు నిర్మాణం చేపట్టకుంటే ఆక్రమణ దారులు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని కోరారు. లేని పక్షంలో కాలనీ వాసులు అందరూ కలిసి పెద్దయెత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో కాలనీ వాసులు ఇరుమల్ల మల్లేశం, అంజారెడ్డి, అశోక్ ప్రసాద్, గంపఉమాపతి, కనకయ్య, రాధారపు దశరథం, హనుమాండ్ల శ్రీనివాస్, సాగర్, రాజమౌళి, జహంగీర్, విజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, బ్రహ్మం, సంపత్, మహేందర్, శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు