గాయత్రీ బ్యాంక్ సేవలను నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలి
హుస్నాబాద్ ఏసిపి వాసల సతీష్
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 15(జనంసాక్షి) హుస్నాబాద్ గాయత్రి బ్యాంక్ బ్రాంచ్ లో సేవింగ్ ఖాతా కలిగిన సోమజి తండా కు చెందిన భూక్యా లావణ్య ప్రమాదవశాత్తు ఇటీవల మరణించగా నమినగా ఆమె భర్త భూక్య రాజుకి గురువారం హుస్నాబాద్ ఏసిపి వాసల సతీష్ చేతుల మీదుగా ప్రమాద బీమా ఒక లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఏసిపి వాసాల సతీష్ మాట్లాడుతూ గాయత్రీ బ్యాంక్ సేవలను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు.గాయత్రి బ్యాంక్ సేవింగ్స్ ఖాతా కేవలం రూ. 600 కలిగిన,ఒక లక్ష రూపాయల ప్రమాద బీమా పథకంతో పాటు లోన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.బ్రాంచ్ మేనేజర్ ఎం సందీప్ మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు తనకపై ఎకరాన ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు పొందవచ్చని, అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోను,అన్ని రకాల సేవలు గాయత్రి బ్యాంకు కలిగి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సందీప్ కుమార్,బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area