గాయాల పాలైన జింకను ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన జడ్పిటిసి దశరథ్ నాయక్
నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 11 జనం సాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తినియోజకవర్గం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర జంతు చిహ్నమైన అడవి జింక తీవ్ర గాయాలతో ప్రత్యక్షమైంది. గాయాలతో బాధపడుతున్న జింకను చూసి స్థానికులు సర్పంచ్ తులసి రామ్ నాయక్ కి సమాచారం అందించారు. జింకను ప్రత్యక్షంగా చూసిన సర్పంచ్ వెంటనే ఆ సమాచారాన్ని జెడ్పిటిసి దశరథ్ నాయక్ కి అందించారు. దీంతో జడ్పిటిసి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే మైసిగండి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు జింకకు తగిన చికిత్సను అందించారు. అనంతరం జడ్పిటిసి, సర్పంచ్ ఇద్దరు కలిసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య, డైరెక్టర్ లాయక్ అలీ వినోద్ వార్డు సభ్యులు పత్తి శంకర్ నాయకులు సోమ్లా రాము తదితరులు పాల్గొన్నారు.