*గాoడ్ల తేలికుల వధూవరుల పరిచయం వేదికను విజయవంతం చేయండి.*
కమ్మర్పల్లి 24.జులై(జనంసాక్షి)ఈనెల 31న హైదరాబాద్ లో నిర్వహించే గాండ్ల తేలికుల వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని గాండ్ల తేలికుల కుల సంఘ సభ్యులు విజయవంతం చేయాలని గాండ్ల తేలికుల సంఘం వధూవరుల పరిచయ వేదిక కేంద్ర కమిటీ సభ్యులు సుంకాజి రవిరాజ్
కమ్మర్ పల్లి మండల కేంద్రంలో జరిగిన దేవగాండ్ల సంఘం మండల సమావేశంలో ఆదివారం అన్నారు.
హైదరాబాద్ లోనే కాచిగూడ సమీపంలో గల బాత్రి తైలిక్ సింగ్ భవన్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వధూవరుల పరిచయవేదిక ఉంటుందని తెలిపారు.
గాడ్ల తేలికుల
ఈనెల 31న న హైదరాబాద్ లో నిర్వహించే గాండ్ల తేలికుల వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమానికి సంబంధించిన కర పత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లి ఈడుకి వచ్చిన పిల్లలకు సరిజోడు చూసి ఈ తరానికి నూతన కొరవడి నేర్పి రాబోయే తరానికి సుఖ శాంతుల కుటుంబాలను నిలబెడదామన్న లక్ష్యంతో ప్రశాంత జీవితాలకు పూలబాటలు వేద్దామని తల్లిదండ్రులు , సంరక్షకులు ఈడొచ్చిన పిల్లలను వెంట తీసుకొని వచ్చి పెళ్లి సంబంధాలను కలుపుకోవాలని తెలంగాణ గాండ్ల తేలికుల సంఘం ఈ పరిచయ వేదికను ఏర్పాటు చేసిందని అన్నారు.
ఈ వివాహ పరిచయ వేదికను కుల బాంధవులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో గాడ్ల తెలికుల సంఘం కుల యువజన విభాగం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కమల్, మండల దేవ గాండ్ల సంఘం కార్యదర్శి గాండ్ల రాజ్ కుమార్,
కోశాధికారి సందరి రవీందర్, ప్రధాన సలహాదారులు గాడ్ల శ్రీనివాస్, గాండ్ల ఓంకార్ ,
గాండ్ల సాంబయ్య ,గాడ్ల శివ తదితరులు పాల్గొన్నారు.