గిట్టుబాటు ధరల కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌15 :  కరవులో అష్టకష్టాలు పడి పండించిన వరికి జిల్లాలోని వివిద మార్కెట్‌లలో సరైన ధరలు దక్కడం లేదు. దీంతో పండిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లకు రబీ వరి పెద్దగా రాకున్నా.. వచ్చిన దానికి సరైన ధరలు లభించలేదు. ప్రభుత్వ మద్దతు ధరలు ప్రకటించాన అవి దక్కడం లేదని వాపోతున్నారు.  ఒక్క నారాయణపేట, దేవరకద్ర,గద్వాల మార్కెట్‌లో గరిష్ఠంగా ధరలు దక్కాయని అంటున్నారు.  నారాయణపేట, దేవరకద్ర మార్కెట్లలో కొద్ది మందికి తప్ప ఇక ఎక్కడా అన్నదాతలకు గిట్టుబాటు ధరలు

లభించలేదు.