గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): గిరిజనులకు ఇచ్చిన హామీలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయ్య నాయక్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మబిక్షం భవన్ లో
రాంసింగ్ అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘ జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చినా హామీలను విస్మరించి గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు.గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.గిరిజన మహిళలపై దాడులు అరికట్టాలన్నారు.పోడు రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.గిరిజనులకు గిరిజన బందు ఇవ్వాలని కోరారు.ఇల్లులేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలన్నారు.అనంతరం తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర రెండవ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా మాజీ కార్యదర్శి బి.అమృనాయక్,సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,
నాయకులు గుగులోతు రాజారాం, మోహనరావు , బానోతు ప్రతాప్ , ఉపేందర్ నాయక్, సుల్తాన్ వెంకటేష్ , లచ్చిరాం , రామారావు, శంకర్ తదతరులు పాల్గొన్నారు.