గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం హర్షనీయం.
టిఆర్ఎస్ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్
జనంసాక్షి, చెన్నరావు పేట
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం హర్షనీయమని,
టిఆర్ఎస్ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షనీయమని టిఆర్ఎస్ మండల యువ నాయకులు బోడ మురళి నాయక్ అన్నారు. బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు.గిరిజనుల ఆరాధ్య దైవమైన సీఎం కేసీఆర్ మాట తప్పని మడమ తిప్పని గొప్ప ఉద్యమ నాయకుడన్నారు.సెప్టెంబర్ 17న జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిగా ఉన్నాడన్నారు.నేటి నుంచి రిజర్వేషన్ల పెంపు అమల్లోకి వస్తుందన్నారు.విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొనడం అభినందనీయమన్నారు.రాష్ట్రంలో గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.ఏడేండ్లు దాటినా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు యావత్ గిరిజన జాతి జీవితాంతం రుణపడి ఉంటుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.