గిరిజనుల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
ఎస్టీ కార్పొరేషన్ రూలర్ ట్రాన్స్పోర్ట్ పథకం ద్వారా యువతకు అభివృద్ధికై ప్రభుత్వం కృషి చేస్తుంది
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 05 : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన కార్పొరేషన్ ద్వారా మల్డకల్ మండల పరిధిలోని నేతోనిపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పుల్లయ్య నాయక్ కు సబ్సిడీ ద్వారా గూడ్స్ వాహనము ను గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు.
లబ్ధిదారుడు పుల్లయ్య నాయక్ ఎమ్మెల్యే శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ……
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారుల లబ్ధి పొందే కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చెందే విధంగా అనేకమైన పథకాలను ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఎస్సీలకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారి అభ్యున్నతలకు కృషి చేస్తుంది అదేవిధంగా బీసీలకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి కూడా అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది.
ఎస్టి (గిరిజన) వారికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తూ గతంలో వారిని తాండాలకి పరిమితం చేసిన నాయకులు వారిని ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రతి తండాకు గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి వారిలోనే ఒకరిని గ్రామ సర్పంచ్ గా నియామకం చేసి మిగతా గ్రామాలతో పాటు తండాల అభివృద్ధి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలని చేస్తుంది. అదేవిధంగా గిరిజన కార్పొరేషన్ ద్వారా సబ్సిడీకి యువత అభివృద్ధికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి జీవన ఉపాధి కల్పిస్తుంది అదేవిధంగా మహిళలకు కూడా అనేకమైన ఎస్టీ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలను ప్రవేశపెట్టి వారు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి కృషి చేస్తున్న నాయకుడు దేశంలోనే కెసిఆర్ మాత్రమే అని గర్వంగా చెప్పడం జరుగుతుందని తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం అందర్నీ ఆదుకొనే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు విజయ్, సర్పంచ్ వీరేష్ నాయక్, ఆలయ కమిటీ డైరెక్టర్ కమ్మరి రాము, గిరిజన కార్పొరేషన్ అధికారి పవన్ కుమార్, తెరాస పార్టీ నాయకులు అజయ్, కృష్ణ, మల్డకల్ మండలం యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.