గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్: ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి

తిరుమలగిరి (సాగర్), అక్టోబర్ 01 (జనంసాక్షి):

మండల కేంద్రంలో శనివారం స్థానిక యం.పి.పి ఆంగోతు భగవాన్ నాయక్ ఏర్పాటు చేసిన సి.యం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా శాసన మండలి సభ్యుడు యం.సి కోటిరెడ్డి హాజరై కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం మాట్లాడారు .
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతం వరకు పెంచుతూ జీ.ఓ జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన హామీ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొనే గొప్ప వ్యక్తి అని ,ఆయన పేదల పక్షపాతి అని మరొకసారి రుజువైందని , తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలోనే సాధ్యమవుతుందని , ప్రజలు ప్రతిపక్షాల మోసపూరిత వాగ్దానాలు నమ్మవద్దన్నారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి, ఇవ్వని వాగ్దానాలను సైతం నెరవేరుస్తున్న గొప్ప దీశాలి అని కొనియాడారు .
ఈ కార్యక్రమంలో,స్థానిక సర్పంచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి,వైస్ యం.పి.పి యడవల్లి దిలీప్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు,గిరిజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.