10 శాతం రిజర్వేషన్ పెంచినందుకు స్వీట్ల పంపిణీ
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 01, (జనం సాక్షి ) :
గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్ అని స్టేషన్ ఘన్పూర్ తహసిల్దార్ ఫుల్ సింగ్ చౌహాన్ అన్నా రు. గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్య మంత్రి కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్ పెంచినందు కు గాను డివిజన్ కేంద్రంలోని తాహసిల్దార్ కార్యా లయం ముందు గిరిజనుల ఆధ్వర్యంలో సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ పూల్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గతంలో ఆంధ్ర పాలనలో తెలంగాణ ఎంతో వెనుకబడి ఉందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం, మన రాజ్యాన్ని మనమే ఏలుకోవడం కోసం సీఎం కేసీఆర్ సుదీర్ఘ పోరాటంచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంజరిగిందన్నారు.గిరిజనులు,చెంచులు, ఆదివాసీలు, ఎరుకల తదితర ఉక కులాలు 32 తేగలు తెలంగాణలో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లంబాడీలకు బంజారా భవన్ ఏర్పాటు చేయడం జరిగిందని, సేవాలాల్ జయం తిని అధికారికంగానిర్వహించడంజరుగుతుందని, మన తండాలో మన రాజ్యం అను నినాదంతో తండాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. గిరిజనులకు 6 శాతం రిజర్వే షన్ ఉండడంతో అనేకమంది గిరిజనులు, గిరిజన ఉక కులాలు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ అవకాశా లు రాకా నష్టపోయారని గిరిజనులకు జీవో 33 ప్రకారం ఆరుశాతం ఉన్న రిజర్వేషన్ 10 శాతానికి పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిజనులు, గిరి జన ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రవీందర్, అర్జున్, విఆర్ఏ రాము,గిరిజన సంఘం నాయకు డు భానోత్ వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.