– గిరిజన రిజర్వేషన్ జీవో నెంబర్ 33 విడుదల చేయడంహర్షదాయకం

– గిరిజన అభినవ అంబేద్కర్ కెసిఆర్ కి పాలాభిషేకం
హుజూర్ నగర్ అక్టోబర్ 2 (జనం సాక్షి): గిరిజన రిజర్వేషన్ జీవో నెంబర్ 33 విడుదల చేయడం హర్షదాయకమని గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అడ్వకేట్ నగేష్ రాథోడ్, నియోజకవర్గ సేవాలాల్ ఉత్సవ కమిటీ కన్వీనర్ బాణావత్ వెంకటేశ్వర్లు నాయక్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గ గిరిజన ముఖ్య నాయకులు పట్టణ కేంద్రంలో మిర్యాలగూడ అడ్డరోడ్డు సెంటర్ నందు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా కాలుస్తూ, మిటాయిలు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.
ఈ సందర్బంగా వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల గిరిజన సంఘాల నిరంతర పోరాటల ఫలితంగా ఈనాడు గిరిజన రిజర్వేషన్ 6శాతం నుండి 10శాతం పెంచుతూ కెసిఆర్ గిరిజన రిజర్వేషన్ జీవో నెంబర్ 33 విడుదల చేయడం హర్షదాయకం అని గిరిజన రిజర్వేషన్ గురించి నిరంతరం కెసిఆర్ కి గుర్తు చేస్తూ జీవో రావడం వెనుక తమ వంతు కృషి చేసిన మంత్రివర్యులు సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, స్థానిక హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కెసిఆర్ గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం పోడు భూమి సమస్యలు, గిరిజన బందు ను వెంటనే అములు చేయాలనీ ఈ సందర్బంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్వతి కొండా నాయక్, జడ్పీటీసీ బాణావత్ జగన్ నాయక్, సర్పంచ్ లు యంకా నాయక్, బాబు నాయక్, వశ్యా నాయక్, తులసి రామ్ నాయక్, భూక్యా నాగరాజు నాయక్, నాగరాజు నాయక్, మణికంఠ నాయక్, కృష్ణా నాయక్, ఎంపీటీసీ రామారావు నాయక్, రాములు, డాక్టర్ జిలేంద్రుడు, అశోక్ నాయక్, పాండు నాయక్, నరినాయక్, శ్రీను నాయక్, సుధాకర్ నాయక్, శ్రీను, శ్రీను, నగేష్, బి. శ్రీను, సైదులు, వీపీ నాయక్, బాలు నాయక్, అజ్మీరా నాగరాజు, జిలేంద్రుడు, చంద్రమౌళి, చందు నాయక్, లక్ష్మణ్ నాయక్, రాములు నాయక్, గబరూ నాయక్, ఉపేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.