గిరిజన రిజర్వేషన్ 10శాతం పెంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి కృతజ్ఞతలు- నేడు పార్టీలకతీతంగా గిరిజన ఐక్యత ర్యాలీని విజయవంతం చేయాలి

హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): గిరిజన సమాజ చిరకాల కోరిక గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి గిరిజనులు కృతజ్ఞతలు తెలుపుతూ హుజూర్ నగర్ లో శనివారం పాలాభిషేకం చేశారన్నారు. గిరిజన ఐక్యత ర్యాలీ కార్యక్రమంను నేడు నియోజకవర్గ స్థాయిలో పార్టీలకతీతంగా హుజూర్ నగర్ లో విజయవంతం చేయాలని గిరిజన హక్కుల పోరాట సమతి వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ రాథోడ్, నియోజకవర్గ సేవాలాల్ ఉత్సవ కమిటీ కన్వీనర్ బాణావత్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ 6 నుండి 10 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 33 ను విడుదల చేసి, గిరిజన బందు, పోడు భూముల సమస్యలను తీరుస్తామని ఇచ్చిన మాట నిజం చేయబోతున్నా తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతగా పాలాభిషేకం చేసి బాణా సంచాలు కలుస్తూ హార్షం వ్యక్తం చేశారు.
నేడు నియోజకవర్గ స్థాయిలో పార్టీలకతీతంగా గిరిజన ఐక్యత ర్యాలీ, పాలాభిషేకం కార్యక్రమం ఉంటుందన్నారు. కావున హుజూర్నగర్ నియోజకవర్గంలోని యావత్ గిరిజన ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వివిధ గిరిజన సంఘాలు, నాయకులు, కవులు, కళాకారులూ, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, ప్రతి గిరిజన బిడ్డలు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు తులిసి రామ్ నాయక్, భూక్యా నాగు నాయక్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు మణికంఠ, మేఘా నాయక్, సిపాయ్ నాయక్, తేజవత్ సైదులు, అంజయ్య, సైదా నాయక్, లక్ష్మ, భాష్య, జిలేంద్రుడు, భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.