గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

టి పి టి ఎఫ్ డిమాండ్
టేకులపల్లి, అక్టోబర్ 18( జనం సాక్షి): గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపలు సమస్యలను పరిష్కరించాలని టి పి టి ఎఫ్ రాష్ట్ర శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ మాలోతు సైదా నాయక్ కు మెమోరాండం అందజేశారు. ఈ మెమోరాండంలో గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని,కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలల్లో పోస్టులు మంజూరు చేయాలని,గ్రేడ్ వన్ హెచ్.డబ్ల్యు.ఓ,ఎ.టి.డి.ఓ,డి.డి తదితర పోస్టులను కామన్ సీనియారిటీ ద్వారా ఉపాధ్యాయులకు ఇవ్వాలని,సిఆర్టి లను రెగ్యులర్ చేయాలని,ఉపాధ్యాయుల అదనపు విధులు రద్దు చేయాలని కోరుతూ కోరారు. ఈ సందర్భముగా టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుటారి రాజు, గుగులోత్ హరిలాల్ నాయక్ లు మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా కన్వర్టెడ్ పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయకపోవడంతో అక్కడ చదివే విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదని,ప్రధానోపాధ్యాయుల దగ్గర పనిచేసిన నాలుగవ తరగతి ఉద్యోగులు పదోన్నతుల ద్వారా ఉన్నత అధికారిగా వచ్చి అదే ప్రధానోపాధ్యాయుడిపై పర్యవేక్షణ చేస్తున్నారని ఇది సరైనది కాదని,గ్రేడ్ వన్ హెచ్.డబ్ల్యు.ఓ,ఏ.టి.డి.ఓ,డి.డి పోస్టుల పదోన్నతులలో ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని,ఉపాధ్యాయులపై మోపుతున్న అదనపు భారాన్ని,అదనపు విధులను రద్దు చేయాలని, విద్యేతర కార్యక్రమాలలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు చేయాలని,అన్ని డిప్యూటేషన్లు రద్దుచేసి నీడ్,సర్ప్లస్ ఆధారంగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్,రాష్ట్ర ఆదనపు ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ