గీతా కార్మికుల సంక్షేమానికి కృషి….ఎమ్మేల్యే డా. సంజయ్
జనం సాక్షి జూలై 26 రాయికల్ ….
గీతా కార్మికుల సంక్షేమం కి తెరాస ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.. రాయికల్ మండలాన్ని ధర్మపురి ఆబ్కారీ సర్కిల్ నుంచి జగిత్యాల సర్కిల్ పరిధికి మార్చినందుకు
రాయికల్ పట్టణంలోని రాయికల్ మండల క్లబ్ లో మంగళవారం రాయికల్ పట్టణ ,మండల గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన ఎమ్మేల్యే మాట్లాడుతూ గీతా కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందిన, వైకల్యం పొందిన గత ప్రభుత్వాల కంటే ఎక్స్ గ్రేషియ పెంచి ఇప్పటికే పలువురికి అందజేశామని పేర్కొన్నారు.. గీతవృత్తినీ ప్రోత్సహించడానికి హరితహారం లో భాగంగా ఈత ,తాటి మొక్కలను అందజేస్తున్నామని అన్నారు.
గౌడ సంఘాలకు వైన్స్ దుకాణంలో రిజర్వేషన్లు, చెట్టు పన్ను మాఫీ చేశామన్నారు.. వయసు దాటిన గీతా కార్మికులకు పింఛను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం గీత కార్మికులకు అన్ని రకాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్, pacs ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి,
మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి రాజేష్, ఉపాధ్యక్షులు మర్రిపెల్లి శ్రీనివాస్ గౌడ్,సర్పంచులు
శ్రీనివాస్ గౌడ్, రాజేశం గౌడ్, రవి గౌడ్, ముత్తయ్య గౌడ్, కౌన్సిలర్ మహేష్ గౌడ్,ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్,మాజీ Amc ఛైర్మెన్ లు ఉదయశ్రి లింగం గౌడ్,రాజీ రెడ్డి,
ఎస్ఐ కిరణ్ గౌడ్,జిల్లా రైతు బంధు సభ్యులు రాధ సాయ గౌడ్, సీనియర్ గౌడ సంఘ నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిదులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.