గీత కార్మికుల సంక్షేమానికి గౌడ్ బంధును అమలు చేయాలి. గీత పనివారు సంఘం జిల్లా అద్యక్షులు విఠల్ గౌడ్

కోటగిరి అక్టోబర్ 23 జనం సాక్షి:-తెలంగాణ గీతా పనివార సంఘం 65 సం.లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆదివారం రోజున కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ గీతా పనివార సంఘం వారోత్సవాలలో భాగంగా నిజామాబాద్ జిల్లా గీతా పనివార సంఘం జిల్లా అద్యక్షులు విఠల్ గౌడ్ గీతా పనివార సంఘం జెండాను ఎగురవేశారు.
అనంతరం వారు సభను ఏర్పాటు చేసుకొని కోటగిరి మండల నూతన గీత పనివార సంఘంను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ.65 సం.ల సుదీర్ఘ పోరాటంలో ఎందరో గీత కార్మికుల,సహకార సంఘల,టి.ఎఫ్.టి కార్మికుల సమస్యలను సాధించడం జరిగిందన్నా రు.1957 సం.లో కామ్రేడ్ ధర్మ బీక్షం నాయకత్వం లో గీత కార్మికుల కొరకు ఒక ప్రత్యేక సంఘం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు గార్ల మండలంలో తెలంగాణ గీత పనివారు సంఘం ఏర్పాటు చేసుకొని ఆనాటి నుండి నేటి వరకు గీత కార్మికుల కోసం అనేకమైన దిశ,దశ ఉద్యమాలు, పోరాటాలు చేస్తూన్న ఘనత ఈ సంఘానికి ఉందన్నారు.ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికులకు,గీత సహకార సంఘలకు గీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ కి 500 కోట్లు కేటాయించి గీత సహకార సంఘలను, టి.ఎఫ్.టి కార్మికులను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.గీత కార్మిక కుటుంబాలకు గీత బంధు పథకం అమలు చేసి 10 లక్షలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.వాస్తవానికి నేడు గీత కార్మికుల వస్తున్న ఫించన్లు కానీ సహకార సంఘలకు ఐదు ఎకరాల భూమి కానీ గీత కార్మికులకు నేడు అందుతున్న ప్రభుత్వ పథకాలు అన్నియు తెలంగాణ గీత పనివార సంఘం వారి పోరాటాల ఫలితమే అని అన్నారు.కాబట్టి గీత కార్మికులు,సహకార సంఘలు ఈ తెలంగాణా గీత పనివార సంఘం సభ్యులు ఈ జెండా క్రింద పనిచేసి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి గీత కార్మికుల హక్కుల కోసం విజయాలు సాధిస్తామ ని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గీత కార్మికు లు,సొసైటీ సభ్యులు, యాదగిరి గౌడ్,సురేష్ గౌడ్, పండరి గౌడ్,నరేష్ గౌడ్,సత్యనారాయణ గౌడ్,శ్రీధర్ గౌడ్,బాలా గౌడ్,గంగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.