గీత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి……. గీతకార్మికులందరికీ గీతన్న బందు ఇవ్వాలి…… కే జి కే ఎస్ జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్

కొమురవెల్లి జనం సాక్షి
రాష్ట్రంలో కల్లు గీత వృత్తిని నామ్ముకొని  ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల  కుటుంబాలకు రూ  10 లక్షలు చొప్పున  గీతన్న బంధు ఇవ్వాలని గీత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని  తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి  బండకింది అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటి పిలుపులో బాగంగా మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ అరుణ్ మాట్లాడుతూ తరతరాల నుండి వృత్తి చేస్తూ ప్రభుత్వానికి పన్నులు కడుతూ స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు,
ప్రభుత్వ లిక్కర్ పాలసీ వలన రోజు రోజుకి వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు,
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యనిషేధం అమలు చేయాలని అన్నారు.సభ్యులైన ప్రతి ఒక్కరికి బైకులు ఇవ్వాలని,మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని అర్వ్ లైన వారందరికీ సభ్యత్వం, డిజిటల్ గుర్తింపు కార్డులు కొత్త జిల్లా పేరుతో ఇవ్వాలని,  డిమాండ్ చేశారు, ఈ ధర్నా కార్యక్రమంలో కే జి కే ఎస్  సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మేరిండ్ల శ్రీనివాస్, కే జి కే ఎస్  కొమురవేల్లి మండల నాయకులు ముత్యం పర్శరాములు గౌడ్, ముత్యం కర్ణాకర్ గౌడ్, , తాళ్లపల్లి కనకయ్య గౌడ్,పచ్చిమడ్ల కనకయ్య గౌడ్, శివలింగు రమేష్  గౌడ్,బండకింది శ్రీదర్ గౌడ్, ముత్యం పర్శరాములు గౌడ్,బత్తిని శివయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు.